Breaking News

Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో

Published on Thu, 11/13/2025 - 07:13

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో 13 మంది మృతి చెందారు. 20 మందికిపైగా జనం గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బయటపడిన సీసీటీవీ ఫుటేజ్‌లో రద్దీ సమయంలో హ్యుందాయ్ ఐ20 కారు  పేలిన ఖచ్చితమైన క్షణాన్ని చూపించింది.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్‌ సమీపంలోని ట్రాఫిక్ కెమెరా నుంచి లభ్యమైన ఫుటేజ్‌లో.. ట్రాఫిక్‌ రద్దీలో నెమ్మదిగా కదులుతున్న తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు, దాని చుట్టూ ఈ-రిక్షాలు, ఆటోలు, ఇతర వాహనాలు కనిపిస్తున్నాయి. తరువాత పేలుడు దృశ్యం కనిపించింది. సోమవారం సాయంత్రం సరిగ్గా 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడు.. జనసాంద్రత అధికంగా ఉన్న పాత ఢిల్లీ ప్రాంతంలో సంభవించింది. అక్కడికి సమీపంలోని వాహనాలు, భవనాలు పేలుడు తీవ్రతకు దెబ్బతిన్నాయి.
 

కేంద్రం  దీనిని హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారికంగా దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ వీడియోలో ఐ20 హ్యుందాయ్ కారు భారీ ట్రాఫిక్ గుండా ముందుకు కదలడం తరువాత ఆకస్మిక పేలుడుతో మంటల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకోలోగానే, కారు పూర్తిగా దగ్ధమైపోయింది. దర్యాప్తు అధికారులు ఆ వాహనం HR 26CE7674 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగినదిగా గుర్తించారు. దీనిని పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అనుమానిత సభ్యుడు డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఉమర్ నబీ అక్టోబర్ 29న ఫరీదాబాద్‌కు చెందిన సోను అనే కార్ డీలర్ నుండి ఐ20ని కొనుగోలు చేశాడు. తరువాతి సీసీటీవీ ఫుటేజ్‌లో నబీ  ఆ కారును రాయల్ కార్ జోన్ సమీపంలోని కాలుష్య నియంత్రణ (పీయూసీ) బూత్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం నబీ ఆ కారును అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడని, అక్కడ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ యాజమాన్యంలోని స్విఫ్ట్ డిజైర్ పక్కన పార్క్ చేశాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ‘ఎన్‌డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. కాగా అతని నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ షకీల్ వాహనం లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ పేరుతో రిజిస్టర్ అయివుంది. ఆయనను కూడా ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్‌ సెల్‌? వారణాసిలో..

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)