Breaking News

కోల్‌కతా డాక్టర్‌ కేసు : సీబీఐ విచారణలో అనుమానాస్పదంగా మాజీ ప్రిన్సిపల్‌ తీరు

Published on Mon, 08/19/2024 - 21:33

కోల్‌కతా : కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ దుర్ఘటనలో ఆర్‌జీ కార్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీష్‌ ఘోష్‌ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో సందీష్‌ ఘోష్‌ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడం లేదని సమాచారం. 

గత మూడు రోజులుగా ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సందీప్‌ ఘోష్‌ను అర్ధరాత్రి వరకు విచారించిన సీబీఐ ఈ రోజు ఆయనకు సమన్లు పంపింది. విచారణలో ఘోష్‌కు సీబీఐ పలు ప్రశ్నలు సంధించిందని, ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

👉ట్రైనీ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారని అంత తొందరగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?

👉మీరు డాక్టర్ కదా.. నేరం జరిగిన స్థలాన్ని, అందులో ఆధారాల్ని సురక్షితంగా ఉంచాలని మీరు అనుకోలేదా?

👉ఎవరి సలహా మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అందులో వాస్తవాలు ఎందుకు లేవు?

👉నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు బాగా తెలుసు. అయినప్పటికీ, విచారణ పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాన్ని  ఎందుకు భద్రంగా ఉంచలేదు?

👉కొన్ని గంటల తర్వాత డాక్టర్ కుటుంబానికి ఎందుకు సమాచారం అందించారు?

👉మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించడంలో ఎందుకు జాప్యం జరిగింది?

👉ఆసుపత్రిలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి?

ఘటన జరిగిన వెంటనే ఎందుకు రాజీనామా చేశారు? దాని వెనుక కారణం ఏమిటి? సీబీఐ అధికారులు ప్రశ్నించగా..ఈ ప్రశ్నలకు మాజీ ప్రిన్సిపాల్ సందీష్‌ ఘోష్‌ సమాధానం చెప్పలేదని అధికారులు సూచిస్తున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)