Breaking News

Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు

Published on Fri, 05/03/2024 - 05:25

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. 

తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్‌ ప్రభుత్వం 2018 నవంబర్‌ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్‌లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ఖాలీ అక్రమాలపై  దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్‌ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

 రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై  సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్‌లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)