Breaking News

కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ మాలిక్‌పై సీబీఐ చార్జిషీట్‌

Published on Fri, 05/23/2025 - 05:13

న్యూఢిల్లీ: కిరు జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ  జమ్మూ కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, మరో ఏడుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. మాలిక్‌తోపాటు అతని అనుచరులు వీరేందర్‌ రానా, కన్వర్‌సింగ్‌ రానాలపై మూడేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్‌ను స్పెషల్‌కోర్టుకు సమర్పించింది. 

చీనాబ్‌వాలీ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.ఎస్‌.బాబు, డైరెక్టర్లు అరుణ్‌కుమార్‌ మిశ్రా, ఎం.కె.మిట్టల్, పటేల్‌ ఇంజనీరింగ్‌ సంస్థ మేనేజిగ్‌ డైరెక్టర్‌ రుపేన్‌ పటేల్, మరోవ్యక్తి కన్వల్‌జీత్‌ సింగ్‌దుగ్గల్‌ పేర్లను కూడా చేర్చింది. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్, నా సహాయకుడిని కూడా అనవసరంగా వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను’’ అని ఎక్స్‌ వేదికగా మాలిక్‌ గురువారం పోస్ట్‌ చేశారు. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)