మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్‌ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు

Published on Wed, 11/20/2024 - 20:31

ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్‌ కాయిన్‌ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. 

అయితే, ఈ బిట్‌ కాయిన్‌ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్‌, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి.  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్‌కాయిన్‌లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.

అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్‌19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్‌మీట్‌లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్‌ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.

కాగా, బిట్‌ కాయిన్‌ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్‌ కాయిన్‌ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)