Breaking News

రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే..

Published on Thu, 10/30/2025 - 11:39

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ పోలీసుశాఖలో కలకలం చెలరేగింది. ఒక సీనియర్ మహిళా అధికారిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ పోలీసు శాఖను కుదిపేసింది. పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా రఘువంశీ చోరీకి పాల్పడటం ప్రధానాంశంగా నిలిచింది.

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా రఘువంశీ తన స్నేహితురాలి ఇంటిలో నుంచి రూ. 2 లక్షల నగదు, మొబైల్ ఫోన్ దొంగిలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపధ్యంలో ఆమెపై కేసు నమోదయ్యింది. భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుశాఖలో జవాబుదారీతనంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు తన మొబైల్ ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచి స్నానానికి వెళ్లానని, ఇంతలో డిఎస్పీ కల్పనా రఘువంశీ తమ ఇంటిలోనికి ప్రవేశించి, తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన నగదు, మరొక సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లారని ఆరోపించారు.

నగదు, ఫోన్‌ కనిపించకపోవడంతో ఫిర్యాదుదారు సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయగా, దానిలో డీఎస్పీ రఘువంశీ ఇంట్లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడం కనిపించింది. ఆ ఫుటేజీలో అధికారిణి  ఆ ఇంటి ఆవరణ నుండి బయటకు వెళ్లేటప్పుడు కరెన్సీ నోట్ల కట్టను పట్టుకుని ఉన్నట్లు కూడా కనిపించిందని పోలీసుల వర్గాలు తెలిపాయి. ఈ ఫుటేజీని చూసిన వెంటనే ఆ మహిళ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు  సదరు అధికారిణిపై దొంగతనం కేసు నమోదు చేశారు. ఇంతలో నిందితురాలు పరారయ్యారు. పోలీసులు ఆమె ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్‌ ప్రారంభించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిట్టు శర్మ మీడియాతో మాట్లాడుతూ నిందితురాలి ఇంటి నుంచి ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, మాయమైన రూ. రెండు లక్షల నగదు గురించి  తెలియలేదన్నారు. నిందితురాలిపై పోలీసు ప్రధాన కార్యాలయం శాఖాపరమైన నోటీసు జారీ చేసిందని, క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇది కూడా చదవండి: ప్రేయసి ఇంట ఉత్కంఠ.. ప్రియుడు హత్య.. యువతి, మామ ఆత్మహత్యాయత్నం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)