Breaking News

కూతురికి లవ్‌ లెటర్‌.. విడిచిపెట్టని తల్లి.. 15 ఏళ్లపాటు కోర్టులో కేసు..

Published on Thu, 06/01/2023 - 12:59

యూపీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం నాటి ఒక కేసులో నిందితునికి కోర్టు ఎట్టకేలకు శిక్ష విధించింది. ఒక మైనర్‌ బాలుడు మరో మైనర్‌ బాలికకు లవ్‌ లెటర్‌ రాశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపధ్యంలో బాలిక తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని బాందా జిల్లాలో 2008లో ఒక మైనర్‌ బాలునిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె ఆ బాలుడు.. తమ కుమార్తె(బాలిక)కు అశ్లీల రీతిలో ఉత్తరం రాయడమే కాకుండా వేధించాడని పేర్కొంది. దీంతో పోలీసులు ఆ బాలునిపై కేసు నమోదు చేశారు. విషయం కోర్టు వరకూ చేరింది.

గత 15 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో పలువురు జడ్జిలు కూడా మారారు. ఎట్టకేలకు చివరికి ఆ యువకుడిని (అప్పుడు బాలుడు) దోషిగా నిర్థారిస్తూ ఏడాదిపాటు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే మూడు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. తెలిసీ తెలియని వయసులో రాసిన ఒక లవ్‌ లెటర్‌ కారణంగా ఆ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ ఉదంతం యూపీలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 2008 మే 21న ఒక మహిళ తన కుమార్తెకు ఒక కుర్రాడు అశ్లీల రాతలతో కూడిన ఉత్తరం రాశాడని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసు 2008లో మొదలై 2023 వరకూ ఏకంగా 15 ఏళ్లపాటు సాగింది. ఈ కేసులో 70 నుంచి 80 వాయిదాలు పడగా, పదిమందికిపైగా జడ్జిలు కూడా మారారు. కాగా తాజాగా ఒక ఉన్నతాధికారి ఈ కేసులో చొరవచూపి,  త్వరగా కేసును పరిష్కరించాలని జడ్జి బీడీ గుప్తాకు విన్నవించారు.

ఈ నేపధ్యంలో నిందితుడు స్వయంగా జడ్జి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. తాను ఎటువంటి కేసును ఎదుర్కోలేనని, ఇటువంటి తప్పు మరోమారు చేయబోనని విన్నవించుకున్నాడు. దీంతో జడ్జి ఆ యువకుని సత్ప్రవర్తనను గుర్తించి, ఏడాదిపాటు పరిశీలన(ప్రొబెషన్‌)శిక్ష విధించారు. దీంతో ఆ యువకుడు ప్రాసిక్యూటింగ్‌ అధికారి పరిశీలనలో ఏడాది పాటు ఉండవలసి ఉంటుంది. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)