Breaking News

ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట

Published on Sun, 12/22/2024 - 10:47

జైపూర్‌ : ‘రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్‌ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్‌యూవీ  క్షణాల్లో  ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.

ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం.  

 

అన్నా.. టీ ఉన్నాయా?
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్‌ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్‌ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.  

నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణం
ప్రమాద సమయంలో ఎస్‌యూవీ నాగౌర్ నుండి బికనీర్‌కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు.  ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)