Breaking News

భారత్‌ జోడో యాత్రలో సియాచిన్‌ హీరో..ఆయనే నాకు స్ఫూర్తి!

Published on Fri, 01/20/2023 - 20:33

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శుక్రవారం జమ్మకశ్మీర్‌లోకి ప్రవేశించింది. ఈ యాత్రలో రాహుల్‌ తోపాటు పరమ వీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్‌ బానా సింగ్‌(రిటైర్డ్‌) పాల్గొన్నారు. ఆయన శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాకు చేరుకున్న రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా రాహుల్‌గాంధీ బానా సింగ్‌ చేతిని పట్టుకుని కనిపించారు. ఈ యాత్రలో బానాసింగ్‌ పాల్గొన్నందుకు ట్విట్టర్‌ వేదికగా ఆయన్ను రాహుల్‌ అభినందించారు.

భారత్‌ ఆదర్శాలను రక్షించడం గురించి మాట్లాడినప్పుడూ బానాసింగ్‌ వంటి ధైర్యవంతులైన దేశభక్తులు పేర్లే గుర్తు తెచ్చుకుంటాను అని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. సియాచిన్‌ మంచుకొండలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరువేసిన పరమవీర చక్ర విజేత కెప్టెన్‌ బానాసింగ్‌​ నాతోపాటు ప్రతి దేశభక్తునికి స్ఫూర్తి అని చెప్పారు రాహుల్‌. ఈ  కథువాలోని జోడో యాత్రలో శివసేన నాయకుడు సంజయ్‌  రౌత్‌ కూడా పాల్గొన్నారు.

"భారత్ జోడో యాత్ర కాశ్మీర్‌ వరకు రావడం చాలా పెద్ద విషయం అన్నారు. వాస్తవానికి, దేశాన్ని ఏకం చేయాలంటే మాత్రం యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పారు. మేము దేశం ఏకం కావాలని మేము కోరుకుంటున్నందున తాను శివసేన నుంచి వచ్చి పాల్గొన్నాను." అని చెప్పారు. ఇదిలా ఉండగా, కెప్టెన్ బానా సింగ్ (రిటైర్డ్) ఆపరేషన్ రాజీవ్‌కు చేసిన కృషికి అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమవీర చక్రను అందుకున్నారు. అతను సియాచిన్ గ్లేసియర్‌లోని పాకిస్థాన్ ఖైద్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పోస్టుకు 'బానా పోస్ట్' అని పేరు కూడా పెట్టారు.

(చదవండి: ఎట్టకేలకు జాకెట్‌ ధరించిన రాహుల్‌..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు