Breaking News

‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలకు చెక్‌

Published on Fri, 06/06/2025 - 19:13

న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం  అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి, ఈ సదస్సుకు ఆహ్వానించారు.  జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్‌ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.

‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ 15-17 తేదీలలో ఆల్బెర్టాలోని కననాస్కిస్ రిసార్ట్‌లో నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్‌నాథ్‌కు ‘మ్యాంగో మ్యాన్‌’ గిఫ్ట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)