అనంతపురం జిల్లాలో భారీ వర్షం
Breaking News
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్ పోలీసులనే తికమక పెట్టాడు
Published on Sun, 07/31/2022 - 10:04
బనశంకరి(బెంగళూరు): జరిమానా చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ ద్విచక్రవాహనదారుడు తన బుల్లెట్ బైక్‌కు ముందు, వెనుక వేర్వేరు నంబర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మరిగౌడ పలు పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో రూ.29 వేల జరిమానా విధించారు.
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముందు వైపు ఒక నంబర్, వెనుక వైపు మరో నంబర్ రాయించాడు.దీంతో పలు మార్లు ట్రాఫిక్ పోలీసులు ముందు ఒక నెంబర్ వెనక మరొకటి చూసి చూసి తికమక పడ్డారు. చివరికి ఈనెల 29వ తేదీన మరిగౌడ రాజాజీనగర కూలినగర వంతెన వద్ద సంచరిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 12 వరకు రిమాండ్ విధించారు.
చదవండి: నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే!
Tags : 1