క్లబ్బుల్లో భక్తి పారవశ్యం.. 20 వేల కోట్లకు పైగా బిజినెస్‌

Published on Tue, 02/10/2026 - 04:01

సాక్షి స్పెషల్‌ డెస్క్‌: మసక వెలుతురు, దట్టమైన పొగలు, నియాన్‌ లైట్లు, తెల్లవార్లూ సాగే ‘టకీలా’ షాట్‌ల సేవనం.. ఇవన్నీ ఇప్పుడు పాత కాలపు యూత్‌ ఫ్యాషన్‌. కొత్త ట్రెండ్‌ ఏమిటో తెలుసా? ‘ఆధ్యాత్మిక ఓలలాట’! భక్తి భావనల ‘దమ్‌ మారో దమ్‌’!  నైట్‌ క్లబ్బుల్లో జరుగుతున్న
ఈ ‘సోబర్‌ రేవ్‌’ (మందు లేని మత్తు) పార్టీలు తాజా ఇండియన్‌ ట్రెండ్‌! అక్కడ డీజే బేస్‌ చప్పుళ్ల బదులు.. వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే, దేహం తాదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది.

ఆలయాలు దాటిన పారవశ్యం
ఇప్పటి వరకు, ప్రశాంతత అలుముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన మన భక్తి ధ్యానం.. ‘ఎరీనా ఎరా’ (స్టేడియం రేంజ్‌ స్టేజ్‌) లోకి అడుగుపెట్టింది. భక్తికి కార్పొరేట్‌ గ్లామర్‌ తోడై, భజన్‌ క్లబ్బింగ్‌ అనే కాన్సెప్ట్‌ జీవం పోసుకుంది.

కాక్‌టైల్స్‌కు బదులుగా తేనీరు 
జెన్‌–జెడ్‌ మెట్రో కుర్రకారు పూర్తిగా పంథా మార్చేశారు. మూస నైట్‌ క్లబ్‌ల గందరగోళాన్ని వదిలేసి, ఆధ్యాత్మిక క్లబ్బులలోకి క్యూ కడుతున్నారు. చేతిలో కాక్టెయిల్‌ గ్లాసులకు బదులు వేడి వేడి కుల్హద్‌ చాయ్‌ పట్టుకుని.. రాధికా దాస్, కేశవమ్‌ వంటి కళాకారుల భజన పాటలకు చిందులేస్తున్నారు.

‘సన్‌  బర్న్‌’ కే సవాలుగా నిలిచి..!
అంతర్జాతీయ స్థాయి ఎల్‌.ఈ.డి స్క్రీన్‌లు, మెరిసిపోయే స్ట్రోబ్‌ లైట్లు, అదిరిపోయే సౌండ్‌ సిస్టమ్‌తో ఈ భజన్‌ క్లబ్బింగ్‌ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ ఈవెంట్స్‌ ఇప్పుడు ‘సన్‌  బర్న్‌’ వంటి పాశ్చాత్య శైలి ఇండియన్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి.

పెరుగుతున్న ఆదరణ
–  మూస  క్లబ్‌ కంటే భజన్‌ ఈవెంట్లలో జనం ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. స్పాన్సర్‌ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్‌ లాభదాయకంగా ఉంటోంది.
– ఆల్కహాల్, గొడవలు లేని ఈ వాతావరణం కుటుంబాలను, యువత ఇద్దరినీ ఆకట్టుకుంటోంది.
– భారత ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో ఇలాంటి ‘కల్చరల్‌ ఎకానమీ’ని దేశ ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా గుర్తించటం కూడా భజన్‌ క్లబ్బింగ్‌కు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.

సాంస్కృతిక సునామీ 
పరిశ్రమ దిగ్గజాలు ఈ భజన్‌ క్లబ్బింగ్‌ కల్చర్‌ను ముద్దుగా ‘భారత్‌కోర్‌’ అని పిలుస్తున్నారు. ఇదేమీ చిన్న మార్పు కాదు, ఏకంగా రూ. 20,000 కోట్ల లైవ్‌ ఈవెంట్స్‌ మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఒక సాంస్కృతిక సునామీ!

మార్చిలో సాజ్‌–ప్రఖర్‌ టూర్‌
2026 మార్చిలో ‘సాజ్‌–ప్రఖర్‌’ బృందం దేశవ్యాప్త టూర్‌ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్‌ లుధియానా వంటి నగరాలను సాజ్, ప్రఖర్‌ దంపతులు భక్తి మత్తులో ముంచేయనున్నారు. సంప్రదాయ భక్తి సంగీతానికి (భజనలు) ఆధునిక క్లబ్‌ శైలిని సమ్మిళతం చేయటం వీరి ప్రత్యేకత.

‘మన్‌ కీ బాత్‌’లో ప్రస్తావన!
2026 జనవరి 25న ప్రసారం అయిన 130 వ ‘మన్‌ కి బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రెండ్‌ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సైతం ఈ కొత్త ఒరవడిని ‘భజన్‌ క్లబ్బింగ్‌’ గా పేర్కొనటంతో దీనికి ఎక్కడ లేని ప్రాముఖ్యం లభించింది.

ప్రధాని ఏమన్నారంటే..
‘‘మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి జెన్‌–జెడ్‌ యువత ఆ భక్తిని తమదైన శైలిలో, ఆధునిక జీవన  విధానానికి అనుగుణంగా మార్చుకోవడం విశేషం. ఇది ఆధునికత, సంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం’’  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)