Breaking News

ఘోర బస్సు ప్రమాదం..18మంది మృతి

Published on Sun, 11/02/2025 - 20:59

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఫలోడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

పోలీసులు సమాచారం మేరకు.. రాజధాని జైపూర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫలోడి జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్ నుంచి బయలుదేరి.. బికనీర్ జిల్లా కోలాయత్ పట్టణంలో దైవ దర్శనం చేసుకని తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. 

ఈ దుర్ఘటపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ప్రకటించారు.

మరోవైపు జసల్మేర్‌ రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. గత నెల (అక్టోబర్ 14)న జైసల్మేర్ సమీపంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు రాష్ట్రంలో రవాణా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, వైద్య సేవలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు