Breaking News

23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌

Published on Sat, 07/18/2026 - 16:05

చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సుకు శనివారం తెల్లవారుజామున పెరంబలూరు సమీపంలోని జాతీయ రహదారిపై మంటలు అంటుకున్నాయి. మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడానికి కొన్ని నిమిషాల ముందే డ్రైవర్‌ ఇబ్రహీం (63) అప్రమత‍్తమై బస్సును ఆపాడు. దీంతో అందులో ఉన్న 23 మంది ప్రయాణికులు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.

ఆ ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి మదురై బయల్దేరింది. డ్రైవర్‌ ఇబ్రహీం మదురై జిల్లా మేలూరుకు చెందిన వ్యక్తి. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తోంది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పెరంబలూరు జిల్లా మంగళమెడు సమీపంలోని అయన్ పెరైయూర్ గ్రామం వద్ద వెళ్తుండగా బస్సు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది.

నిద్రిస్తున్న ప్రయాణికులను లేపిన డ్రైవర్‌
డ్రైవర్ ఇబ్రహీం వెంటనే పొగను గమనించి బస్సును రహదారి పక్కన ఆపాడు. ప్రమాదాన్ని గుర్తించి... నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి వెంటనే కిందికి దిగాలని చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు చేతికి దొరికిన సామాన్లు తీసుకుని బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రయాణికులు దిగుతున్న సమయంలోనే ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్ది సేపటికే బస్సు మొత్తం భారీ మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న మంగళమెడు పోలీసులు, జాతీయ రహదారి గస్తీ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వెప్పూర్, పెరంబలూరు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.

దాదాపు 15 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా చేసి, ఉదయం 7 గంటల కల్లా అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఇనుప చట్రం మాత్రమే మిగిలింది. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లలేకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎదురువైపు లేన్‌లోకి వాహనాలను మళ్లించి అడ్డంకిని తొలగించారు. ఉదయం 7 గంటల సమయంలో ఎర్త్‌మూవర్ల సాయంతో బస్సును జాతీయ రహదారి నుంచి తొలగించారు.

ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయడంలో అధికారులు సాయం చేశారు. ప్రయాణికులు తమ సామాన్లు తీసుకుని తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సును ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళమెడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)