Breaking News

దూసుకొచ్చిన పాక్‌ డ్రోన్లు.. పేల్చిసిన భారత భద్రతా బలగాలు

Published on Thu, 07/24/2025 - 18:59

అమృత్‌సర్‌: నార్కో-టెర్రర్‌ నెట్‌వర్క్‌లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత భద్రతా బలగాలు షాకిచ్చాయి. పంజాబ్‌ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్‌ఎఫ్‌ పాక్‌ నుంచి భారత్‌ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది. 

ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు డ్రోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో మూడు డ్రోన్లు ఏరియల్‌ ఫొటోగ్రఫీ,వీడియోల్ని తీసేందుకు ఉపయోగించే డీజీఐ మావిక్‌ డ్రోన్‌లు కాగా.. మరో మూడు డ్రోన్లలో మూడు పిస్టల్స్‌,వాటిల్లో బుల్లెట్లను నింపేందుకు వినియోగించే మ్యాగిజైన్‌ను,1.1 కేజీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ విభాగం అధికారికంగా ప్రకటించింది.    

అమృత్‌సర్ జిల్లాలోని మోధే గ్రామం వద్ద రాత్రి సమయంలో ఐదు డ్రోన్లను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు టెక్నాలజీ సాయంతో వాటిని కూల్చేశారు. అక్కడ మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు,హెరాయిన్ ఉన్న నాలుగు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టర్న్ టారన్ జిల్లాలోని డాల్ గ్రామం వద్ద పిస్టల్ భాగాలు, మ్యాగజైన్‌ను గుర్తించారు. అటారి గ్రామం వద్ద మరో డ్రోన్‌ను అడ్డుకుని రెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. 

భారత భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ ప్రేరిత నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌లపై గట్టి దెబ్బగా భావిస్తున్నారు. బీఎస్‌ఫ్‌, పంజాబ్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.కాగా, ఇలాంటి ఘటనలు సరిహద్దు భద్రతను మరింత కఠినంగా చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)