Breaking News

BSF Jawan: బ్రష్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదట..!

Published on Fri, 05/16/2025 - 20:17

న్యూఢిల్లీ:  గత నెల 23వ తేదీన పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన భారత బీఎస్‌ఎఫ్‌ జవాన్ పీకే(పూర్ణం కుమార్‌) షాను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్‌ విడిచిపెట్టింది. బీఎస్‌ఎఫ్‌కు చెందిన భారత జవాన్‌ పీకే షా అనుకోకుండా పాకిస్తాన్‌ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్‌ పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్‌ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్‌.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దాంతో పాకిస్తాన్ ఆ బీఎస్ఎప్ జవాన్ విడిచిపెట్టక తప్పలేదు

నిద్రలేని రాత్రులు.. మానసిక వేధన!
జవాన్ పీకే షా పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా  ఆ కుటుంబాన్ని సంప్రదించగా  ఆ జవాన్ భార్య పలు విషయాలను వెల్లడించారు. పీకే షా భార్య రజని మాట్లాడుతూ.. ‘ నా భర్తను శారీకంగా హింసించలేదని, ప్రతీ రాత్రి విచారించారని, ఇది మానసికంగా కుంగదీసిందని భర్త చెప్పినట్లు భార్య రజనీ తెలిపింది.

మూడు వారాలకు పైగా పాక్ కస్టడీలో ఉన్న షాను సైనికుడిలా కాకుండా గూఢచారిలా చూశారని, మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించారని  చెప్పినట్లు ఆమె స్పష్టం చేసింది. ఆ ప్రదేశాలల్లో ఒకటి ఎయిర్ బేస్ అయి ఉండొచ్చనే అనుమానం కల్గిందని భర్త చెప్పిన విషయాన్ని ఆమె వెల్లడించింది.

భర్త పీకే షాకు తిండి పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా, బ్రష్ చేసుకోవడానికి అనుమతించే వారు కాదని.  భర్త నిద్రలేమితో ఉన్నట్లు తనతో మాట్లాడినప్పుడు అర్థమైందని ఆమె పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)