Breaking News

బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌లపై కేంద్రం వేటు

Published on Sat, 08/03/2024 - 09:49

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపు నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్ట్రాల కేడర్‌లకు తిరిగి పంపిస్తున్నట్టు వెల్లడించింది.

కాగా నితిన్‌ అగర్వాల్‌ 1989 బ్యాచ్‌ కేరళ కేడర్‌ అధికారి కాగా.. ఖురానియా 1990 బ్యాచ్‌ ఒడిశా కేర్‌కు చెందినవారు. గతేడాది జూన్‌లో బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా  అగర్వాల్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఖురానియా  ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళానికి నేతృత్వం వహిస్తున్నారు.

కాగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా బీఎస్‌ఎఫ్‌లో దాదాపు 2.65 లక్షల మంది జవాన్లు ఉన్నారు. వీరు పశ్చిమ దిక్కున పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్‌తో భారత సరిహద్దులను కాపాడుతున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)