అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
118 పాక్ ఫార్వర్డ్ పోస్టులు, నిఘా వ్యవస్థలు తుత్తునియలు
Published on Sat, 05/31/2025 - 04:58
పూంఛ్: ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ బలగాలు పాకిస్తాన్కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులతోపాటు సమాచార, నిఘా వ్యవస్థను తుత్తునియలు చేశాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తీవ్రంగా నష్ట పోయిన శత్రుదేశం తిరిగి కోలుకునేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల ఉద్రిక్తతల సమయంలో పౌర ఆవాసాలతోపాటు, మన సరిహద్దులపైకి దాడులకు పాల్పడిన పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన బీఎస్ఎఫ్ బలగాలను ఆయన ప్రశంసించారు.
పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న సమయంలో సైతం ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ, ముందుగానే కచ్చితమైన సమాచారంతో విజయవంతంగా దాడులను పూర్తి చేయగలమని బీఎస్ఎఫ్ రుజువు చేసిందన్నారు. ఎడారులు, పర్వతప్రాంతాలు, అడవులు, కఠినమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అచంచలమైన అంకిత భావంతో పనిచేస్తూ దేశానికి మొదటి రక్షణ శ్రేణిగా సేవలందిస్తోందన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం జమ్మూ ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో మంత్రి పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన అమర్నాథ్ యాత్రకు చేపట్టిన ఏర్పాట్లు, జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. ఇటీవల పాక్ కాల్పులతో పూంఛ్ జిల్లాలో నష్టపోయిన సరిహద్దు ప్రాంతాల వాసులతో మాట్లాడారు. జవాన్లతో స్వయంగా ముచ్చటించారు.
Tags : 1