ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడాడని... ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా?

Published on Mon, 08/07/2023 - 07:17

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన ఒక ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడటం వివాదాస్పదంగా మారి, అతని తమ్ముని హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భజన పాట పాడటంపై తలెత్తిన వివాదంలో గాయకుని సోదరుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. 

ఈ ఘటనలో మృతి చెందిన ఖుర్షీద్‌(17) గాయకుడు ఫర్మానీ నాజ్‌కు వరుసకు సోదరుడు అవుతాడు. ఈ ఘటన రతన్‌పురీ పరిధిలోని ముహమ్మద్‌పుర్‌ మాఫీ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహాశివుని కీర్తిస్తూ సాగే ‘హర హర శంభో’ అనే పాటను ముస్లిం గాయకుడు నాజ్‌ గత ఏడాది పాడాడు. ఈ నేపధ్యంలో దేవబంద్‌కు చెందిన ఒక ముస్లిం మతపెద్ద ఇది మత విశ్వాసాలకు విరుద్దమంటూ అతనిపై ఫర్మానా జారీ చేశారు. 

అయితే నాజ్‌ ముస్లిం మతపెద్ద తీర్మానాన్ని తప్పుబడుతూ కళాకారులకు ఎటువంటి మతం ఉండదని, తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు. నాజ్‌ గతంలో సింగింగ్‌ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-12లో కూడా పాల్గొన్నారు. నాజ్‌ నిర్వహిస్తున్న యూ ట్యూబ్‌ చానల్‌కు 4.5 మిలియన్లకు మించిన సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 

కాగా నాజ్‌ సోదరుడు ఖుర్షీద్‌ హత్య కేసులో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని అద్నాన్‌, వాజిద్‌, జుబేర్‌లుగా పోలీసులు గుర్తించారు. వారంతా కూడా గాయకుడు నాజ్‌కు వరుసకు సోదరులే కావడం విశేషం. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. 
ఇది కూడా  చదవండి: అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)