Breaking News

కుక్క కోసం తలలు పగిలేలా కొట్టుకున్నారు, ప్రేమ పెళ్లి రద్దు!

Published on Fri, 02/20/2026 - 17:22

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కను కొట్టిన కారణంతో రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా రెండేళ్ల ప్రేమను, బంధాన్ని కాదనుకుంది వధువు. అసలు ఏమైంది అంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ ఫతేపూర్ జిల్లాలోని ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.  నిజానికి  అ‍ప్పటికే రెండేళ్లుకుగా ప్రేమలో ఉన్న  సుమీత్‌, తాన్య  జంట  పారిపోయి కాన్పూర్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. అయితే  విషయం తెలిసిన పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి, ఫతేపూర్‌లో  బంధువుల సమక్షంలో మరోసారి ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.

పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించేందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరుల కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. బారాత్‌, జైమాల వేడుక సంతోషంగా పూర్తైంది. ఇక తెల్లవారుజామున ముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రగడ మొదలైంది. పూజామందిరంవద్ద ఆభరణాల సమర్పణ ఆచారాలు జరుగుతుండగా, వధువు పెంపుడు కుక్క అవిశ్రాంతంగా మొరగడం మొదలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన వరుడు తరపు బందువు ఒకరు ఆ కక్కను కొట్టాడు. దీంతో వధువు, ఇతర బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతవరణం ఉద్రిక్తంగా మారిపోయింది. బంధువులంతా కర్రలు, కుర్చీలతో తలలు పగిలేలా కొట్టుకోవడంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. దీంతో వధువు వైపు ముగ్గురు, వరుడి వైపు ఇద్దరు గాయపడ్డారు. వధువు వేలు కూడా విరిగింది.

ఇదీ చదవండి: గ్లోబల్‌ జాబ్స్‌కు సెగ, ఎంట్రీ లెవల్‌ జాబ్స్‌ డేంజర్‌లో : IMF చీఫ్
 

ఈ విషయం ఖాగా పోలీస్ స్టేషన్‌కు చేరడంతో  అధికారులు జోక్యం చేసు కున్నారు.  గాయపడిన వారిని సెంట్రల్ హెల్త్ సెంటర్ (CHC)లో చికిత్స చేసి, ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి పంపించారు. అనంతరం ఇరు వర్గాల సీనియర్ సభ్యుల మధ్య చర్చించారు.  ఈ క్రమంలో వధువు తాను ఇకపై తానీ పెళ్లిని కొనసాగించ లేనని వధువు స్పష్టం చేసింది. చివరికి కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చు కునేందుకు రాజీ కుదిరింది. ఏ పక్షమూ అధికారికంగా ఫిర్యాదేమీ లేదు కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)