పెళ్లిలో వధువు కొంగులాగిన కొంటె మరిది : రచ్చ రచ్చ

Published on Sat, 07/11/2026 - 17:53

తమ్ముడు చేసిన అభ్యంతకర చర్య అన్నయ్య పెళ్లికి చేటు తీసుకొచ్చింది. పెళ్లి ఆచారాలు జరుగుతున్న సమయంలో వధువు కొంగు (పల్లూ) లాగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.  ఈ ఘర్షణలో పెళ్లి కొడుకు తలకు తీవ్ర గాయమవ్వగా, పలువురు గాయపడ్డారు. దీంతో పెళ్లి కాస్తా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. అనుకున్న సమయానికి పెళ్లి జరిపించేందుకు పెద్దలు, పురోహితులు సిద్ధంగా ఉన్నారు. అటు పెళ్లి  బరాత్‌ కూడా షెడ్యూల్ ప్రకారమే కల్యాణ మండపానికి చేరుకుంది. వేడుకలు కూడా సజావుగానే సాగుతున్నాయి. అయితే, పెళ్లి చివరి ఘట్టానికి చేరుకున్న సమయంలో, పెళ్లికొడుకు తమ్ముడు  పిచ్చి వేషం వేశాడు. కాబోయే వదిన అన్న ఇంగిత జ్ఞానం  లేకుండా  ఆమె  కొంగు పట్టుకొని లాగాడు. అంతే దుమారం రేగింది. వధువు బాబాయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అలా మొదలైన వివాదం మధ్య తీవ్ర రూపం దాల్చింది.  మద్యం సేవించిన మరికొంతమంది  బంధువులు దీనికి  మరింత ఆజ్యం పోశారు.  అంతే ఈ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులుగా మారింది. వరుడు, వధువు తరఫు బంధువు (కజిన్) కూడా గాయపడ్డాడు. గొడవ పెద్దది కావడంతో పెళ్లి ఆచారాలను మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చింది. ఇరువర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవడి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్‌, తలలు పగిలాయ్‌!

గురువారం నాడు గ్రామ సర్పంచ్ సమక్షంలో ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్‌లోనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఎట్టకేలకు ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. గాయపడిన వారి వైద్య ఖర్చుల కోసం రూ. 4,500 చెల్లించేలా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తానికి ఇరు కుటుంబాలు శాంతించి, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం  వధూవరులను ఒకటి చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇరువర్గాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయని, ఎవరూ కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)