Breaking News

వరుడు పెళ్లి టైంలో హ్యండిచ్చి పారిపోతే..ఆ వధువు ఏకంగా..

Published on Wed, 05/24/2023 - 07:28

చాలామంది పెళ్లి పేరుతో వంచన చేయడం లేదా పెళ్లి రేపు అనగా పరారవ్వడం గురించి విన్నాం. ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు భోరుమని కన్నీళ్లుపెట్టుకోవడం వంటి కథలే చూశాం. మోసపోతే కన్నీళ్లతో కూలబడిపోవడం కాదని, తెగించి మరీ ఆ మోసగాడిని పట్టుకుని కిక్కుమరనకుండా చేయాలని నిరూపించింది ఓ వధవు. పెళ్లిమండపం వద్ద భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వధువు చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోక మానరు. ఆమెను ప్రశసించకుండా ఉండలేం.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువు పెళ్లిరోజున వరుడు పెళ్లికి నిరాకరించి..చెప్పపెట్టకుండా పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు కోసం ఎదురు  చూస్తూ కూర్చొన్న వధువు ఈ షాకింగ్‌ ఘటనను జీర్ణించుకోలేకపోయింద. ఏమైన సరే అతన్ని వెతికి తెచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె పెళ్లి డ్రస్‌లోనే అతడిని వెదకడం ప్రారంభించింది. అతడు ఫోన్‌లో వాళ్ల అమ్మను తీసుకురావడానికే వెళ్లానంటూ చెప్పినా అమె నమ్మలేదు.

ఏకంగా 20 కిలోమీటర్లు చేజ్‌ చేసి మరీ అతడ్ని పట్టుకుంది. అతడు సరిగ్గా బరేలీ పోలీస్టేషన్‌ సమీపంలోని బస్సులో దొరికాడు. అతడ్ని పెళ్లిమండపానికి వెంట బెట్టుకుని తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించి సదరు వదువరులిద్దరికి పెళ్లి చేశారు.నిజానికి అతడు ఆ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సరిగ్గా పెళ్లి టైంకి అతడి హ్యాండివ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా వెదిక పట్టుకునైనా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మరీ ఇంతటి సాహసం చేసింది ఆ నవ వధువు. తన వివాహాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె కనబర్చిన ధైర్యానికి అందరిచే ప్రశంసలు అందుకుంది. 

(చదవండి: రూ.2 వేల నోటు మార్పిడికి తంటాలు)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు