Breaking News

ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాల్సిందే 

Published on Wed, 10/28/2026 - 06:34

న్యూఢిల్లీ:  జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది జరిగిన పహల్గాం దాడితోపాటు అన్ని రకాల ఉగ్రవాద చర్యలను ‘బ్రిక్స్‌’పార్లమెంటరీ ఫోరమ్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫోరమ్‌ రెండు రోజుల సదస్సులో మంగళవారం ఒక సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించారు. ఉగ్రవాద ముప్పు ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే గట్టిగా ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకూడదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. 

ప్రపంచ దేశాలపై ఏకపక్ష ఆర్థిక ఆంక్షల విధింపును కూడా ఖండించారు. ఇటువంటి బలవంతపు చర్యలు ప్రజల అభివృద్ధి, ఆరోగ్యం, ఆహార భద్రత హక్కులతో సహా మానవ హక్కులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని స్పష్టంచేశారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన ‘బ్రిక్స్‌’పార్లమెంటరీ ఫోరమ్‌ సమావేశం మంగళవారం ముగిసింది. సంయుక్త డిక్లరేషన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి, దాని భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలకు బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ మద్దతు తెలిపింది. 

ఈ సంస్కరణలు ఐరాస, భద్రతా మండలిని మరింత న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రభావవంతంగా, సమర్థవంతంగా మార్చాలని ఆకాంక్షించింది. సమకాలీన వాస్తవాలను, అంతర్జాతీయ సమాజ అవసరాలను మెరుగ్గా ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలని తేల్చిచెప్పింది. ఏ కారణంతోనైనా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా జరిగినప్పటికీ.. ఎటువంటి ఉగ్రవాద చర్యలనైనా తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాయింట్‌ డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఇలాంటి చర్యలు నేరపూరితమేనని ఉద్ఘాటించారు. ఉగ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని వెల్లడించారు. 

ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారందరినీ, వారికి మద్దతు ఇచ్చేవారిని సంబంధిత జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఫోరమ్‌ సూచించింది. ఉగ్రవాదం పట్ల సున్నా సహనాన్ని పాటించాలని, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని కోరింది. 

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి చార్టర్‌తో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రపంచ దేశాలు తమ బాధ్యతలను పూర్తిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడంలో తమ మద్దతు ఉంటుందని సూచించింది. పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని నొక్కిచెప్పింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై ఫోరమ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాలు సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచి్చంది.  

మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయాలి: ఓం బిర్లా  
ప్రపంచ శాంతికి అసలైన అర్థం అందరికీ భద్రత, గౌరవం, న్యాయం లభించేలా చూడటమేనని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. ప్రపంచంలోని ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువతరం ఉజ్వలమైన భవిష్యత్తును కోరుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం ఢిల్లీలో 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడంతోపాటు రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయాల్సిన బాధ్యత నేటి తరాలదేనని పేర్కొన్నారు. మనం వారికి ఎంత సురక్షితమైన, ప్రశాంతమైన, సుసంపన్నమైన ప్రపంచాన్ని అందించామనే దానిని బట్టి భవిష్యత్తు తరాలు మనల్ని అంచనా వేస్తాయని వివరించారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)