Breaking News

‘అమ్మా.. నేను దొంగను కాను’ అంటూ 12 ఏళ్ల బాలుడు..

Published on Sat, 05/24/2025 - 12:54

మేదినీపూర్: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని మేదినీపూర్‌ జిల్లాలో అవమానభారంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్స్కురాలోని గోసైన్బర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రాంతానికి చెందిన దుకాణదారుడు.. చిప్స్‌ ప్యాకెట్లు దొంగిలించావని ఆరోపిస్తూ ఒక బాలుడి చేత గుంజీలు తీయించాడు. అందరిముందు దుకాణదారుడు అవమానించడంతో తీవ్రంగా కలత చెందిన ఆ 12 ఏళ్ల బాలుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పన్స్కురాలోని ఒక స్వీట్ షాపు బయట వేలాడదీసిన చిప్స్‌ ప్యాకెట్లు గాలికి ఎగిరిపోయాయి. వాటిని ఒక బాలుడు తీసుకున్నాడు. దీనిని గమనించిన దుకాణం యజమాని షువాంకర్ దీక్షిత్ ఆ బాలుడిని పట్టుకుని, తీవ్రంగా దండిస్తూ, చెవులు పట్టుకుని గుంజీలు తీయాలంటూ బలవంతం చేశాడు. అలాగే ఆ చిప్స్‌ ప్యాకెట్లకు రూ. 15 చెల్లించాలని డిమాండ్‌ చేశాడు.  

ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ బాలుని తల్లి కుమారుని మందలించడమే కాకుండా చెంపదెబ్బ కొట్టింది. దీంతో కలతచెందిన ఆ బాలుడు తాను ఎటువంటి చోరీ చేయలేదని తల్లికి చెప్పాడు. ఆ తరువాత పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు బాలుడిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దుకాణం యజమాని దీక్షిత్‌ పరారయ్యాడు. బాలుని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: యూపీలో నాలుగు కోవిడ్‌-19 కేసులు నమోదు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)