Breaking News

సరిహద్దులు మారొచ్చు.: రాజ్‌నాథ్‌ సింగ్‌

Published on Sun, 11/23/2025 - 21:32

న్యూఢిల్లీ:   భారత విభజన  సమయంలో  పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన సింధ్‌ అనే ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావొచ్చని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం సింధ్‌ ప్రాంతం భారతదేశంలో భాగంగా లేదు కానీ ఆ నాగరికత సౌరసత్వం అనేది మనకే అనుసంధానమై ఉన్నందును తిరిగి భారత్‌లో విలీనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఢిల్లీలో ఆదివారం సింధి సమాజ్‌ సమ్మేళన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

అప్పుడు ఎప్పుడో పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన ఆ ప్రాంతం.. తిరిగి మన భారతదేశంలో భాగమవడానికి అవకాశం ఉందన్నారు. సింద్‌ అనేది ఎప్పటికీ మనదేనని, సరిహద్దులు అనేవి భౌగోళికంగా మారుతుంటాయన్నారు. కాగా,  సింధ్‌ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. ఇది పాకిస్తాన్‌లోని నాలుగు ప్రధాన ప్రావిన్స్‌లలో ఒకటి. 1947లో భారత విభజన సమయంలో సింధ్‌ పాకిస్తాన్‌లో భాగమైంది. ఆ సమయంలో అనేక మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వెళ్లారు. సింధ్‌ ప్రాంతం మోహెంజోదారో వంటి పురాతన సింధు లోయ నాగరికత స్థలాలకు ప్రసిద్ధి. సింధ్‌ ప్రావిన్స్‌కు కరాచీ రాజధానిగా ఉంది. 

 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)