నీట్‌, జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం..

Published on Thu, 07/02/2026 - 18:33

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో, ఇకపై అడ్మిషన్ల మెరిట్ జాబితాలో క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్రమైన వివాదాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎంట్రన్స్‌ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత లభిస్తుంది. 

ఎంట్రన్స్ పరీక్షల సిలబస్‌ను పాఠశాల పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్చడం ద్వారా విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ లీకేజీల రిస్క్‌ను పూర్తిగా తగ్గించడానికి, క్రమంగా అడాప్టివ్ ఆన్ డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లనున్నారు.

ప్రస్తుత విధానం ప్రకారం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తిగా నీట్, జేఈఈ ఎంట్రన్స్ స్కోర్‌లపైనే ఆధారపడి జరుగుతోంది. బోర్డు పరీక్షలు కేవలం అర్హత సాధించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి,అనధికారిక విద్యాసంస్థల వ్యాప్తిని, కోచింగ్ సంస్కృతిని అరికట్టడానికి విద్యాశాఖ నియమించిన తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)