Breaking News

బీజేపీ విజయానికి.. కాంగ్రెస్‌ ఓటమికి.. ఐదు కారణాలివే!

Published on Tue, 12/05/2023 - 13:16

రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్‌లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నిక‌ల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్‌ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు. 

బీజేపీ విజయానికి ఐదు కారణాలు
పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు.
ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది. 
టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు.
‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది. 

కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు
రాష్ట్రంలోని సీనియర్‌ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది.
టిక్కెట్ల కేటాయింపులో సీనియర్‌ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది.
బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు.
పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం  కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఇది కూడా చదవండి: రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే!

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)