Breaking News

అద్వానీ @ 98.. శుభాకాంక్షల వెల్లువ

Published on Sat, 11/08/2025 - 11:28

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ ఈరోజు (శనివారం) తన 98వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యున్నత దృష్టి, తెలివితేటలతో ఆశీర్వాదం పొందిన రాజనీతిజ్ఞుడు’ అని ఆయనను అభివర్ణించారు.
 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లక్షలాది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకులని అభివర్ణించారు. ఆయన పార్టీని గ్రామాల నుండి నగరాల వరకు బలోపేతం చేశారని,హోంమంత్రిగా భారతదేశ భద్రతను బలోపేతం చేశారని అమిత్‌ షా కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. లాల్ కృష్ణ అద్వానీ తన జీవితాన్ని సమగ్రత, దేశభక్తికి అంకితం చేశారన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అద్వానీని బీజేపీ కుటుంబానికి మార్గదర్శక శక్తిగా ప్రశంసించారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన జీవితం సమగ్రత, దృఢ నిశ్చయం, నిస్వార్థ సేవకు నిజమైన ప్రతిబింబం అని అన్నారు. 1980లో జనతా పార్టీ రద్దు తర్వాత, అద్వానీ మరో నేత అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించారు. 2002 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అద్వానీ భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు.

ఇది  కూడా చదవండి: 9న ‘బీఎస్ఎఫ్’ సాహస యాత్ర

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)