Breaking News

ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నిరసన.. బీజేపీ ఆగ్రహం

Published on Fri, 02/20/2026 - 19:01

న్యూఢిల్లీ:  ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో భాగంగా చివరిరోజున కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ .. ఇది ఎటువంటి మేధస్సులేని, భావోద్వేగంలేని చర్యగా అభివర్ణించింది. 

ఈ సమ్మిట్‌ ఐదవరోజు శుక్రవారం(ఫిబ్రవరి 20వ తేదీ) భారత్ అధికారికంగా అమెరికా ప్రధాన ఏఐ ప్రాజెక్ట్ Pax Silicaలో చేరింది. ఇది అమెరికా యొక్క కృత్రిమ మేధస్సు-సరఫరా గొలుసు భద్రతకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం. అయితే దీనిపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది. భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ)లో ఆఖరిరోజు సదస్సులో భాగంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు విప్పి  నినాదాలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్‌ ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువైపోయాయంటూ పలువురు నిరసనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది.  ఇది చొక్కాలు లేని నిరసనే కాదు.. బుర్రలేని నిరసన అంటూ కౌంటర్‌ ఇచ్చింది బీజేపీ. 

చివరి రోజు సమ్మిట్‌లో భాగంగా భారత విద్యా వ్యవస్థపై పునరాలోచించడం, అమెరికా-భారత్ భాగస్వామ్యం ద్వారా AI యుగానికి శక్తినివ్వడం,  చర్చలు-రాజనీతిలో  ఏఐ వినియోగం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)