Breaking News

కాంగ్రెస్‌ ఫైల్స్‌ అంటూ వీడియో రిలీజ్‌ చేసిన బీజేపీ

Published on Mon, 04/03/2023 - 13:00

 కాంగ్రెస్‌ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు సంబంధించి ‘కాంగ్రెస్‌ ఫైల్స్‌’ అనే వీడియో ట్రైలర్‌ని బీజేపీ విడుదల చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అంటే అవినీతి అనే సిరీస్‌ పేరుతో కాంగ్రెస్‌ ఫైల్స్‌ అనే మొదటి ఎపిసోడ్‌ను ఆదివారం విడుదల చేసింది బీజేపీ . ఆ వీడియోలో కాంగ్రెస్‌ తన 70 ఏళ్ల హయాంలో ప్రజల నుంచి  దాదాపు రూ. 4 లక్షల కోట్ల రూపాయలు వరకు దోచుకుందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ అంటే అవినీతి సిరీస్‌కి సబంధించిన వీడియోని రిలీజ్‌ చేసింది.

కాంగ్రెస్‌ దోచుకున్న మొత్తాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పౌర భద్రత కోసం ఉపయోగించవచ్చని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు బీజేపి  ట్విట్టర్‌ వేదికగా ఆ వీడియో రిలీజ్‌ను ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన వీడియో ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది. ఆ వీడియోలో.. ఈ మొదటి ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ పాలనలో ఒకదాని తర్వాత ఒకటిగా కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి.  కాంగ్రెస్‌ కొట్టేసిన డబ్బుతో 24 ఐఎన్‌ఎస్‌ విక్రంత్‌, 300 రాఫెల్‌ జెట్‌లు, వెయ్యి మంగళ్‌ మిషన్‌లు కొనుగోలు చేయగలిగేవాళ్లం.

కాంగ్రెస్‌ చేసిన మోసం కారణంగా దేశం అవన్నీ నష్టపోవడంతో విజయంలో వెనకబడిపోయిందని బీజేపీ విమర్శలు చేసింది. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్‌ పాలనను బీజేపీని కోల్పోయిన దశాబ్దంగా అభివర్ణించింది. "ఆ సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన హాయంలో జరిగిన అవినీతిని చూసి చూడనట్లు వదిలేసారని, ఫలితంగా వార్తపత్రికలన్నీ స్కామ్‌ వార్తలతో నిండిపోయాయి. దేశం సిగ్గుతో తలవంచుకుంది. అని వీడియోలో పెద్ద ఎత్తున విమర్శిలు చేసింది బీజేపీ. అంతేగాదు ఆ వీడియోలో ఇంకా బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి  పలు కుంభకోణాలు గురించి కూడా ప్రస్తావించింది. వీడియో చివర్లో సినిమా ఇంకా అయిపోలేదని ఓ ట్విస్ట్‌ కూడా ఇచ్చింది బీజేపీ.

(చదవండి: ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్‌ ఫైర్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)