నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Mon, 08/03/2026 - 07:23

ఢిల్లీ: జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన విద్యార్థులు, సీజేపీ నిరసన కార్యక్రమంపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరసనలో పాల్గొన్న వారిలో విద్యార్థుల కంటే "పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు" ఎక్కువ మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన బిధూరి మాట్లాడుతూ.. ‘జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎవరనేది మీకు తెలుసు’ అని అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ.. "ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరు. మోదీ జీని దూషించే వారు పంక్చర్ వేసేవాళ్ల పిల్లలు లేదా వారి కుటుంబాలకు చెందినవారే" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నీట్ (NEET) అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జనరేషన్-జెడ్ (Gen Z) యువతను తప్పుదోవ పట్టించాయని బిధూరి ఆరోపించారు. ‘నీట్ సమస్య పేరుతో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జంతర్‌మంతర్ వద్ద యువతను సమీకరించాయి. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం, పార్లమెంట్‌పై దాడికి ప్రయత్నించడం, దేశంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం’ అంటూ ఆయన అన్నారు.

జెన్-జెడ్‌కు అవగాహన కల్పించాలి..
గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, అంతకుముందు 12 ఏళ్ల పరిస్థితుల గురించి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిధూరి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిన జనరేషన్-జెడ్‌ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. గత 12 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి వివరించాలని అన్నారు. అయితే, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి కూడా నిరసనలో పాల్గొన్న వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశముంది.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)