Breaking News

చైన్‌ స్నాచర్ల అరాచకం.. సినిమా రేంజ్‌లో బీజేపీ ఎంపీ ఛేజింగ్‌.. 

Published on Sat, 05/06/2023 - 12:26

పాట్నా: ఆయనో ఎంపీ.. కానీ, సినిమా రేంజ్‌లో దొంగల భరతం పట్టాడు. సినిమా లెవెల్‌లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో చైన్‌ స్నాచర్లను పట్టుకున్నారు. అనంతరం వారిని.. పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. ఔరంగాబాద్‌లోని బరున్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్‌ మెడికల్‌ కాలేజీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను పరామర్శించింది. అనంతరం.. సరిత తన భర్త రాజేష్‌ గుప్తాతో కలిసి బైక్‌పై ఇంటి వెళ్తోంది. అయితే, వారిని గమనించిన ముగ్గురు దొంగలు కొద్ది రోజులు దూరం బైక్‌ను ఫాలో చేసి దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు. 

ఇక, అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్‌ కుమార్‌ సింగ్‌ దొంగలను చూశారు. వెంటనే అప్రమత్తమై.. దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని కారును తిప్పమని డ్రైవర్‌కు సూచించారు. అలా దాదాపు 13 కిలోమీటర్లు ఎంపీ కారుతో.. దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో కారు.. దొంగల దగ్గరుకు వెళ్లగానే.. వారు రెచ్చిపోయారు. వారి వద్ద ఉన్న గన్‌తో ఎంపీ సుశీల్‌కు గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు. 

అయితే, దొంగలకు బెదిరింపులను ఎంపీ కొంచెం కూడా బెదరలేదు. అలాగే, వారిని వెంబడిస్తూ వెళ్లారు. కాగా, మధుపుర్‌ అనే గ్రామం వద్దకు వెళ్లగానే రోడ్డు పక్కనే ఉన్న బురదలో బైక్‌ స్కిడ్‌ అయి వారు కిందపడిపోయారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్‌లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్‌ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇక, నిందితులను టింకు కుమార్‌, ఆనంద్‌ కుమార్‌, ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. దొంగల వద్ద నుంచి బంగారం, మొబైల్‌ ఫోన్‌, ఫారిన్‌ గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)