ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా ఎమ్మెల్యే.. రెండు గంటలు డ్యూటీ

Published on Wed, 11/19/2025 - 07:21

బెంగళూరు: బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌ కుమార్‌ మంగళవారం ట్రాఫిక్‌ పోలీస్‌ అవతార మెత్తారు. నగరంలోని భాష్యం సర్కిల్‌ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్‌ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్‌ కాప్‌ ఫర్‌ ఎ డే’అనే వినూత్న ప్రయోగంలో భాగంగా ఆయన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పాత్ర పోషించారు.

ట్రాఫిక్‌ పోలీసు జాకెట్‌ ధరించిన ఆయన, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పనిచేశారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ట్రాఫిక్‌ నిర్వహించడంతోపాటు వారితో సంభాషించారు. సిగ్నల్‌ కంట్రోల్‌ పోస్ట్‌ను నిర్వహించిన ఆయన.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘ఒక రోజు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పనిని నేను ఆస్వాదించాను. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసుల ఈ చొరవ స్వాగతించదగినది.’ అని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇక నుంచి ప్రతి సోమవాకం ఒక గంట పాటు ట్రాఫిక్‌ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

‘ఈ రోజు నాకు ఒక పండుగలా ఉంది. ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్నారా? వాటికి ఎలా స్పందిస్తున్నారు? వంటి విషయాలను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఇది జీవితంలో మంచి అనుభవం’ ఓ వీడియోలో పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు ‘బీటీపీ ఏఎస్‌టీఆర్‌ఏఎమ్‌’ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకునే అవకాశాన్ని బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు కల్పించారు. ఇందులో నమోదు చేసుకున్న పౌరులు ఆ పరిధిలోని స్టేషన్‌ అధికారులు లేదా సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది.   

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)