Breaking News

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌

Published on Fri, 12/06/2024 - 14:28

ముంబై: బీజేపీ సీనియర్‌ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో శుక్రవారం  జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్.. కొలాంబ్‌కర్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ ప్రమాణస్వీకారం చేశారు. 

మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో కొలాంబ్‌కర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో సెంబ్లీకి శాశ్వత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.  త్వరలో నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.

కాగా మహారాష్ట్రలో ఎట్టకేలకు  దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా  దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్‌ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మోంశాఖమంత్రి అమిత్‌ షా సహా  బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్‌ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు