జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
Breaking News
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరణ! రాష్ట్రపతిని కలిసేందుకు ప్లాన్
Published on Mon, 08/29/2022 - 19:43
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి ముందు విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు రోజంతా అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యాయి. ప్రతిపక్ష శాసన సభ్యులైన బీజీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆప్ పార్టీపై వచ్చిన ఆరోపణలపై చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. వారంతా తరగతి గదుల నిర్మాణం, ఎక్సైజ్ పాలసీ 2021-22 అవకతవకలు జరిగిన ఆరోపణలపై చర్చ జరగాలని గట్టిగా డిమాండ్ చేశారు.
దీంతో బీజీపీ ఎమ్మెల్యేలను బహిష్కరణకు గురై ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఈ మేరకు బీజేపీ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి మాట్లాడుతూ...బీజేపీ ఎమ్మెల్యేలను రాజ్యంగ విరుద్ధంగా అసెంబ్లీ నుంచి రోజంతా బహాష్కరించారంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అందువల్లే ఈ అంశాలపై చర్చించేందుకు భయపడుతోందని దుయ్యబట్టారు.
ఆప్ పార్టీ నియంతృత్వంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఎప్పటికప్పుడూ విపక్షాలను సభ నుచి తరిమికొడుతుందని ఎద్దేవ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఈ విషయమై రాష్ట్రపతిని సంప్రదిస్తామని తేల్చి చెప్పారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌తో కూడా సభను నిరంతరాయంగా వాయిదా వేస్తున్న ఆంశాన్ని కూడా లేవనెత్తుతామని బిధూరి అన్నారు.
ఢిల్లీలో ఏడాది పొడవునా కనీసం మూడు శాసనసభ సమావేశాలు జరగాలని వాటి వ్యవధి పది రోజుల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధన పెట్టాలని అభ్యర్థిస్తామని చెప్పారు. ప్రస్తుతం కేవలం ఒక్క రోజు సుదీర్ఘ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని అందులో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఢిల్లీ ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదని బిధూరి ఆరోపించారు.
Tags : 1