Breaking News

Bihar: ముఖ్యమంత్రి ఎవరు? 

Published on Sat, 11/15/2025 - 05:37

పట్నా: బిహార్‌లో ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్‌ సీఎంగా కొనసాగుతారా? లేక మరో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. మళ్లీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే అంటూ సోషల్‌ మీడియాలో జేడీ(యూ) పోస్టు చేసింది. కొద్దిసేపటికే దాన్ని తొలగించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నితీశ్‌ను మరోసారి సీఎంను చేయడం బీజేపీకి ఇష్టంలేదని ప్రచారం సాగుతోంది. 

నితీశ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి, బీజేపీ నాయకుడినే గద్దెనెక్కిస్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి తమ కూటమి గెలిస్తే నితీశ్‌ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచి్చంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీశ్‌ సైతం మళ్లీ కుర్చి ఎక్కాలని ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని పటా్నలో భారీగా పోస్టర్లు, బోర్డులు వెలిశాయి. ‘‘25 నుంచి 30.. మళ్లీ నితీశ్‌’’ అంటూ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు.  

మహారాష్ట్ర తరహా ప్రయోగం  
బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ తన బలం చాటుకుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ)పై ఆధారపడాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోయింది. జేడీ(యూ)ను పక్కనపెట్టి, చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ(రామ్‌ విలాస్‌)తో పొత్తు కొనసాగిస్తే బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం తేలికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం జేడీ(యూ) అండతో మనుగడ సాగిస్తోంది. కాబట్టి జేడీ(యూ) స్నేహాన్ని వదులుకొనే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో మహారాష్ట్ర తరహా ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదు. 

మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో శివసేన(షిండే) నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీ చివరకు తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎంగా కిరీటం అప్పగించింది. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు సామ్రాట్‌ చౌదరి తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సమీకరణాలు కలిసొస్తే ఆయన బిహార్‌ సీఎం అయ్యే అవకాశాలున్నాయి.  బిహార్‌ ఎన్డీయేలో పెద్దన్న జేడీ(యూ). ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీ       (యూ)తో సమానంగా సీట్లు పంచుకుంది. రెండు పక్షాలు 101 సీట్ల చొప్పున తీసుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు నెగ్గి, జేడీ(యూ)పై స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. ముఖ్యమంత్రి పదవిని డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకుంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)