Breaking News

పాక్‌ ముస్లిం లీగ్‌.. జైరామ్‌ రమేష్‌ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

Published on Mon, 06/16/2025 - 07:51

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌- బీజేపీల మధ్య మరోమారు దుమారం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను అమెరికా ఆహ్వానించిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అమెరికా  ఈ నకిలీ వార్తలను ఖండించిందని పేర్కొన్న బీజేపీ.. పాకిస్తాన్‌న్‌కు కాంగ్రెస్‌ మౌత్‌పీస్‌గా మారిందని వ్యాఖ్యానించింది.  కాంగ్రెస్‌ వైఖరి అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారని, దీనిపై విలేకరుల సమావేశంలో ప్రస్తావించారని,  అయితే మునీర్  అమెరికా వెళ్లడం లేదని తేలిందని బీజేపీ నేత చెందిన నిషికాంత్ దూబే మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌.. పాక్‌కు మౌత్ పీస్ మాదిరిగా ప్రవర్తిస్తూ, ప్రజలను ఇలా తప్పుదారి పట్టిస్తున్నదని, పాకిస్తాన్ ముస్లిం లీగ్- జైరామ్ రమేష్ మధ్య తేడా ఏమిటని దూబే ప్రశ్నించారు.
 

ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం, ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విదేశాంగ విధానమే కారణమని దూబే ఆరోపించారు. దీనికి ఉదాహరణగా 1970లనాటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న కెనడా కేసును ఆయన ఉదహరించారు. 1970- 1984 మధ్య కాలంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఖలిస్తానీలపై చర్య తీసుకోవాలని కోరుతూ, కెనడా ప్రధాని పియరీ ఎలియట్ ట్రూడోకు ఏడు లేఖలు రాశారని,  అయితే వాటిపై ఎటువంటి అర్థవంతమైన స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ వరుస క్షిపణి దాడులు.. ఇజ్రాయెల్‌లో నిరంతర హెచ్చరిక సైరన్లు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)