Breaking News

‘మరీ ఇంత దిగజారిపోవాలా కమల్‌?’

Published on Tue, 10/07/2025 - 11:36

తమిళ అగ్రనటుడు, మక్కల్‌ నీధి మయ్యమ్‌(MNM) అధినేత కమల్‌ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై(Annamalai Slams Kamal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్‌ ఘటనలో స్టాలిన్‌ ప్రభుత్వంపై కమల్‌ హాసన్‌ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.

సెప్టెంబర్‌ 27వ తేదీన కరూర్‌లో జరిగిన విజయ్‌ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌ పరామర్శించారు.  ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్‌ అన్నామలై భగ్గుమన్నారు.

రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌పై మండిపడ్డారు. ‘‘కరూర్‌ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’  అని అన్నామలై అన్నారు. 

ఇదిలా ఉంటే.. కరూర్‌ బాధితులను పరామర్శించిన అనంతరం కమల్‌ మీడియాతో మాట్లాడారు. ఈ విషాదంపై విచారణ జరుగుతున్న దశలో రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. దీనిని మానవీయ కోణంలోనే చూడాలి. ప్రభుత్వం ప్రజల పక్షాల నిలబడాలి. సీఎం స్టాలిన్‌ నాయకత్వ లక్షణం కనబరిచారు. పోలీసులు, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని అన్నారు. అదే సమయంలో ‘‘క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకోవాల్సిన సమయం ఇది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే విజయ్‌ను ఉద్దేశించినవేనన్న కామెంట్‌(Kamal Blames Vijay on Karur Incident) బలంగా వినిపిస్తోందక్కడ. 

ఇదీ చదవండి: విజయ్‌కు సపోర్ట్‌గా బీజేపీ, ఆ పార్టీ కూడా!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)