Breaking News

మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్‌, తలలు పగిలాయ్‌!

Published on Sat, 07/11/2026 - 10:56

ఎంతో ఉత్సాహంగా కళకళలాడిన పెళ్లి వేడుక కాస్తా ఉన్నట్టుండి హింసాత్మకంగా మారి పోయింది. మటన్ విందు ఇస్తామని చెప్పి, చికెన్ వడ్డించారనే ఆగ్రహంతో వివాదం మొదలైంది. ఇరువర్గాలు ఒకరిపై  ఒకరు కత్తులు దూసుకున్నారు. బిహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే
అధికారుల సమాచారం ప్రకారం బిహార్‌కు చెందిన మహ్మద్ అన్వర్ కుమారుడైన మహ్మద్ అబ్దుల్లా అలియాస్ చాంద్‌కు, మహ్మద్ జావేద్ అలియాస్ మోటో కుమార్తెకు గురువారం మధ్యాహ్నం నిఖా (పెళ్లి) జరిగింది. కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా ముగిసాయి. అందరూ మంచి ఆకలితో భోజనాలకు కూర్చున్నారు. అంతే  తీవ్ర  కలకలం రేగింది. కారణం ఏమిటయ్యా అంటే మటన్‌ విందు అని  చెప్పి చీప్‌గా చికెన్‌ వడ్డిస్తారా అంటూ మగపెళ్లివారు గొడవకు దిగారు.  ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో దాదాపు ఒక డజను మందికి పైగా గాయపడ్డారు.

ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!

కత్తులు, కర్రలతో దాడి
ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందులోని ఒక క్లిప్‌లో కొందరు వ్యక్తులు అతిథులపై కర్రలతో దాడి చేయడం, ఒక వ్యక్తి ఏకంగా కత్తి పట్టుకుని బెదిరించడం కనిపించింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులే తమ బరాత్‌లపై దాడి చేశారని పెళ్లికొడుకు తరఫు వారు ఆరోపించారు. ఈ గొడవలో గాయపడిన వారిని వెంటనే సిమ్రి బక్తియార్‌పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)