Breaking News

బిహార్‌ నుంచే మోదీ సర్కార్‌ పతనం 

Published on Thu, 09/25/2025 - 06:06

సాక్షి, న్యూఢిల్లీ:  త్వరలో జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అవినీతి పాలన పతనానికి నాంది పలుకుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను భారంగా భావిస్తున్న బీజేపీ ఆయనను మానసికంగా రిటైర్‌ చేసిందని చెప్పారు. బుధవారం పట్నాలో సీడబ్ల్యూసీ భేటీలో ఖర్గే మాట్లాడారు. బిహార్‌ను ఒక ఉదాహరణగా చూపించి లక్షలాది మంది ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

ఓటరు జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ సమయంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనమంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం కావడమే కారణమని ఆరోపించారు. మోదీ గొప్పగా చెప్పుకుంటున్న స్నేహితులే  భారత్‌ను సమస్యల వలయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఒకవైపు స్వదేశీ అని చెబుతున్న మోదీ మరోవైపు చైనాకు బహిరంగంగా ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు.   

ఈబీసీల రక్షణకు చట్టం: రాహుల్‌   
బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)ను వేధింపుల నుంచి రక్షించడానికి చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈబీసీలకు న్యాయం చేయడానికి 10 సంకల్పాలను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో ఈబీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతామన్నారు. 

రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఈబీసీలకు కలిపి 50 శాతం కోటా కలి్పస్తామన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఈబీసీలు ప్రవేశాలు కలి్పస్తామని తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా భూమి పంపిణీ చేస్తామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి రిజర్వేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్‌ ప్రకటించారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్‌ బాంబు పేల్చబోతున్నానని స్పష్టంచేశారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)