Breaking News

మరొకరి వీపుపై కూర్చుని..  వరద ప్రాంతాల్లో ఎంపీ పర్యటన

Published on Tue, 09/09/2025 - 06:18

న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్తుండగా, వరద ప్రభావిత ప్రాంతాలను తిలకిస్తున్నట్లుగా ఉన్న ఎంపీ తారిఖ్‌ అన్వర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాంగ్రెస్‌ నేత, బిహార్‌లోని కటిహార్‌ ఎంపీ అయిన తారిఖ్‌ అన్వర్‌ తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సోమవారం బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించాలనుకున్నారు. అయితే, ఓ వ్యక్తి మోస్తుండగా ఆయన పర్యటన కొనసాగించారు. 

ఎంపీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ వ్యక్తి వీపుపై మోసుకెళ్తూండగా వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకున్నా మారుమూల ప్రాంతాలకు వెళ్లారని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఎంపీ తారిఖ్‌ అన్వర్‌ తీరును బీజేపీ తప్పుబట్టింది. వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లినా కాంగ్రెస్‌ నేతలకు వీవీఐపీ ప్రొటోకాల్‌ కావాల్సి వచ్చిందా? అని ఆ పార్టీ నేత పూనావాలా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ ఎంపీ వీవీఐపీ మోడ్‌. రాహుల్‌ గాంధీ వెకేషన్‌ మోడ్‌. ఆమ్‌ఆద్మీ పార్టీ హైడింగ్‌ మోడ్‌. ప్రధాని మోదీ మాత్రమే వర్క్‌ మోడ్‌’అని వ్యాఖ్యానించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)