Breaking News

బీహార్‌ ‘గేమ్‌ ప్లాన్‌’.. లుకలుకలకు పుల్‌స్టాప్‌!

Published on Thu, 10/23/2025 - 09:11

బీహార్‌లో గ్రాండ్‌ అలయన్స్‌(Mahaghat Bandhan) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపింది. సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాత్‌ చొరవతో కూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

మహాఘట్‌ బంధన్‌లో సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఓ స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. లెక్క తేలకపోవడంతో ఎవరికివారే అభ్యర్థులను ప్రకటించుకుని నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అయితే దీనిని ‘ఫ్రెండ్లీ పోటీ’గా అభివర్ణించుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌లు.. మరో పక్క ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్ గెహ్లాత్‌, మాజీ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్నాట్నాలో నిన్నంతా బిజీబిజీగా గడిపారు. భాగస్వామ్య పార్టీల కీలక నేతలతో సమావేశమై సీటు పంపకాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 8 స్థానాల్లో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని,  మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కాంగ్రెస్‌ ఎంపీ అఖిలేష్‌ సింగ్‌ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. CPI (ML) నేత దీపంకర్ భట్టాచార్య త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)