Breaking News

మేం ల్యాప్‌ టాప్స్‌ ఇస్తే.. వారు గన్స్‌ ఇస్తున్నారు: మోదీ

Published on Sat, 11/08/2025 - 12:58

సీతామర్హి: ‘‘మేం ల్యాప్‌ టాప్స్‌ ఇస్తే.. వారు గన్స్‌ ఇస్తున్నారు.. బిహార్‌కు తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు’’ అంటూ ఆర్జేడీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్‌లోని సీతామర్హిలో శనివారం.. ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. బీహార్‌కు స్టార్టప్‌లు అవసరం.. 'హ్యాండ్స్ అప్' గ్యాంగ్ కాదంటూ విమర్శలు గుప్పించారు.

ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీల టార్గెట్‌గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. రాష్ట్ర యువతను గూండాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్డీఏ యువతకు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి అందిస్తుండగా.. ఆర్జేడీ మాత్రం తుపాకులు ఇవ్వాలనుకుంటోందంటూ మండిపడ్డారు.

ఇవాళ్టి నాయకులు తమ పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలు చేయాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లలను మాత్రం గూండాలుగా తయారు చేయాలనుకుంటున్నారు. బీహార్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు. జంగిల్ రాజ్ అంటే ‘తుపాకులు, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’గా మోదీ అభివర్ణించారు. 

బిహార్‌లో నవంబర్ 11న రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ విమర్శల దాడి మరింత పెంచారు. ఆర్జేడీ ప్రచార గీతాలు, నినాదాలు వినగానే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ పార్టీ నాయకుల ప్రచారంలో బీహార్ పిల్లల కోసం వారు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్జేడీ వేదికలపై అమాయక పిల్లలను గ్యాంగ్‌స్టర్లుగా మారాలనుకుంటున్నట్లు చెప్పిస్తున్నారు’’ అంటూ మోదీ ఆరోపించారు.

 

 


 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)