Breaking News

ఎల్లో కవర్ల కలకలం.. అర్ధరాత్రి బీహార్‌లో పొలిటికల్‌ హైడ్రామా

Published on Tue, 10/14/2025 - 10:49

బీహార్‌ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్‌(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్‌ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే.. 

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్‌ బంధన్‌లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్‌లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్‌సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి.. 

లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.  అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి. 

కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్‌ సింగ్‌ అలియాస్‌ బోగో కూడా ఉన్నారు.  అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్‌ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్‌ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. 

ఇదిలా ఉంటే.. మహాఘట్‌ బంధన్‌లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్‌ 70 స్థానాల్లో, ముకేష్‌ సాన్హీ వికాస్‌షీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్‌ ఫస్ట్‌ ఫేస్‌కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్‌ 6న పొలింగ్‌ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్‌ 14న కౌంటింగ్‌.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)