Breaking News

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

Published on Thu, 07/02/2026 - 16:50

బిహార్‌లో పాఠశాల త్రైమాసిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, బక్సర్‌లోని ఓ విద్యా కేంద్రంలో ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పరీక్షా సామగ్రి నిర్వహణ తీరు ఉండాల్సింది ఇలాగేనా? అని విమర్శలు వస్తున్నాయి.

ఈ ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాలను 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల కోసం బిహార్ బోర్డు పంపింది. అవి బక్సర్‌లోని బునియాది పాఠశాలకు చేరాయని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.

వైరల్ దృశ్యాలు.. ప్రజల్లో ఆగ్రహం
అయితే, భారీ వర్షంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు నీటిలో పడి కనిపించాయి. ఇంత కీలకమైన పరీక్షా సామగ్రిని వర్షంలో నిర్లక్ష్యంగా వదిలేశారని పలువురు అధికారులపై విమర్శలు చేశారు. 

ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి. సున్నితమైన పరీక్షా సామగ్రి వర్షంలోకొట్టుకుపోయేలా ఎలా చేశారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. చాలామంది దృష్టిలో ఈ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకగా మారింది. మరోవైపు, పరీక్షా సామగ్రికి ఎలాంటి నష్టం జరగలేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అకస్మాత్తుగా వర్షం పడటంతో కట్టలు నీటిలో కనిపించినా, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని, పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. 

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)