Breaking News

అక్రమ రవాణాకు అడ్డాగా బీహార్‌ ఈస్ట్ వెస్ట్ కారిడార్

Published on Mon, 10/14/2024 - 12:04

పట్నా: నేపాల్‌, మయన్మార్‌, కొరియా దేశాల స్మగ్లర్లు భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బీహార్‌ను తమ అడ్డగా మార్చుకుంటున్నారు. బీహార్ మీదుగా వెళ్లే ఈస్ట్ వెస్ట్ కారిడార్ స్మగ్లర్లకు కొత్త మార్గంగా మారింది. నేపాల్‌కు సమీపంలో ఉండటంతో స్మగ్లర్లకు ఈ రహదారి వరంలా మారింది. ఈ మార్గంలో నేపాల్ నుంచే కాకుండా మయన్మార్, కొరియా దేశాల నుంచి కూడా ‘సరుకులు’ రవాణా అవుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి.

స్మగ్లర్ల సిండికేట్ ఈ మార్గం ద్వారా విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ కమిషనర్ డా.యశోవర్ధన్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పట్నా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మోతీహరి పోలీసుల సహాయంతో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కారిడార్‌లో తొలిసారిగా ఒక కిలో 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. 15 రోజుల వ్యవధిలో దర్భంగా, ముజఫర్‌పూర్ మధ్య మైతీ టోల్ ప్లాజా సమీపంలో భారీగా విదేశీ సిగరెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రూ.ఒక కోటి 30 లక్షల విలువైన దక్షిణ కొరియా సిగరెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో బరేలీకి చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

తాజాగా తూర్పు చంపారన్‌లోని నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డులో రూ.9 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుల బస్సు నుంచి 9,500 సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ విభాగం అధికారులు మోతీహరి నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికితోడు భారతదేశంలో తయారయ్యే సిగరెట్లు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలియవస్తోంది.

ఇది కూడా చదవండి: బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)