Breaking News

వచ్చారు, బైక్‌లో పెట్రోల్‌ నింపుమన్నారు.. లైటర్‌ వెలిగించారు..

Published on Thu, 05/25/2023 - 20:17

భోపాల్‌: వాహనంలో ఇంధనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, భోపాల్‌ మాత్రం కొందరు ఆకతాయిలు కావాలనే ఓ పెంట్రోల్‌ బంక్‌కు నిప్పంటినట్టు తెలుస్తోంది. బైక్‌లో పెట్రోల్‌ కొట‍్టించుకునే క్రమంలో ముగ్గురు యువకులు బంక్‌కు వెళ్లారు.సిబ్బంది పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా లైటర్‌ వెలిగించాడు. 

దాంతో ఒక్కసారిగా మంటలు పెట్రోల్ నాజిల్ ద్వారా బైక్‌కు వ్యాపించాయి. అటునుంచి పెట్రోల్ పంపుకు ఎగబాకాయి. భయంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన పెట్రోల్ పంపు సిబ‍్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కటరా హిల్స్‌లోని రేణుగా పెట్రోల్ బంక్‌లో జరిగింది. రూ.8000 నష్టం జరిగినట్లు బంక్‌ యాజమాన్యం పేర్కొంది.
(చదవండి: వాహ‌నంలో పెట్రోల్ ఉద‌యం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి స‌రైన స‌మ‌యం ఏదంటే..)

సంఘటన స్థలం నుంచి ఇద్దరు నిందితులు పారిపోగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. టైల్స్ వర్క్ చేసే ఇతనిపై ఇప్పటికే క్రిమినల్ రికార్డ్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విజయ్ సింగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్‍లుగా గుర్తించారు. వీరు మెకానిక్ వర్క్ చేసేవారని స‍్థానికులు వెల్లడించారు. 

అయితే, నిందితులు కావాలనే లైటర్‌ వెలిగించారా? లేక మరే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌లో సిబ్బంది పెట్రోల్ నింపే క్రమంలో రీడింగ్ చూడడం కోసం ఓ యువకుడు లైటర్ వెలిగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డ తర్వాతే ఈ ఘటనకు అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.  
(మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!)

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)