ఉగ్రవాదానికి భారత్‌ తలొగ్గదు: అమిత్‌ షా

Published on Wed, 04/23/2025 - 13:57

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్న అమిత్ షా.. పుష్పగుచ్ఛం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎక్స్‌ ఖాతాలో ఆయనొక పోస్ట్‌ ఉంచారు.

భారమైన హృదయంతో పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు అని ట్వీట్‌ చేశారాయన.

పహల్గాం ఉగ్రదాడి సమాచారం అందుకున్న వెంటనే మంగళవారమే అమిత్‌ షా జమ్ము కశ్మీర్‌ చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతులకు నివాళులర్పించిన అనంతరం.. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఘటన వెనక ఉన్నవారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలతో అమిత్‌ షా స్పష్టం చేశారు. 

కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్ షా

ఆపై కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ఆయన.. అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)