Breaking News

చేతిలో రాజ్యాంగం.. ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం

Published on Tue, 06/25/2024 - 17:51

కేంద్రంలో మూడోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో బీజేపీ ప్ర‌భుత్వం కొలువుదీరిన అనంత‌రం .. తొలి 18వ లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌.. సభ్యులతో ప్రమాణం చేయించారు.  

ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మంగ‌ళ‌వారం లోక్‌సభ స‌భ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయ‌న‌తో ప్రమాణం చేయించారు. చిన్న రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్‌లో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. చివరలో జైహింద్, జై సంవిధాన్ అని నినదించారు. ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్‌ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని  వయనాడ్‌ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్‌ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వ‌య‌నాడ్‌.. రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేసి విజయం సాధించారు. అనంత‌రం ఆయన వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వ‌య‌నాడ్ నుంచి రాహుల్ సోద‌రి ప్రియాంక గాంధీ బ‌రిలో నిల‌వ‌నున్నారు.

ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు.

 

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)