Breaking News

కానిస్టేబుళ్లకు రామచరితమానస్‌ , గీతా పాఠాలు ఎక్కడో తెలుసా?

Published on Sat, 11/08/2025 - 12:16

భోపాల్‌:  పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత తరగతులు నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ పోలీసుల శిక్షణ విభాగం నిర్ణయించింది. ఇది వారు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది శిక్షణ పాఠశాలల సూపరింటెండెంట్లకు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (శిక్షణ) రాజా బాబు సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో దాదాపు 4,000 మంది యువతీ యువకులు తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్‌ శిక్షణ పొందుతున్నారు, ఇది గత జూలైలో ప్రారంభమైంది. 

రామచరితమానస్‌ పఠనం 
ఐపీఎస్‌ అధికారి సింగ్, ఈ శిక్షణ తరగతులను జూలైలో ప్రారంభించినప్పుడే.. రామచరితమానస్‌ పఠనానికి కూడా ఆదేశించారు. ఇది వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని అప్పుడే ఆయన స్పష్టం చేశారు. తాజాగా, శిక్షణ పాఠశాలల డైరెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సాధ్యమైతే, శ్రీకృష్ణుడి పవిత్ర మాసమైన మార్గశిరంలో శిక్షణలో భాగంగా... కనీసం భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాలని సూచించారు. కాగా, ఈ అధికారి గతంలో 2019 ప్రాంతంలో గ్వాలియర్‌ రేంజ్‌ పోలీసు అధిపతిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించి, స్థానిక జైలు ఖైదీలు, ఇతరులకు భగవద్గీత ప్రతులను పంపిణీ చేశారు.  

(తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్‌ : నెటిజనుల భావోద్వేగం)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)